విద్యుత్‌ వైర్ల దొంగలనుపట్టుకున్న రైతులు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వైర్ల దొంగలనుపట్టుకున్న రైతులు

Sep 10 2026 12:45 AM | Updated on Sep 10 2026 12:45 AM

మునగపాక : మండలంలో పలు చోట్ల విద్యుత్‌ వైర్లను అపహరించుకుపోతున్నారు. దీంతో పలువురు రైతులు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం మునగపాకకు చెందిన శరగడం ఆదినారాయణకు చెందిన మోటార్‌ వైర్లను కట్‌ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అనకాపల్లి బీఆర్‌టీ కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు వైర్లను తొలగిస్తుండడాన్ని గమనించిన స్థానిక రైతులు వారిని పట్టుకునే క్రమంలో ఒకరు పారిపోగా మిగిలిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement