సమన్వయంతోవిద్యా ప్రమాణాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతోవిద్యా ప్రమాణాలు పెంచాలి

Sep 10 2026 12:45 AM | Updated on Sep 10 2026 12:45 AM

కోటవురట్ల : విద్యా ప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయుల సమన్వయం అవసరమని డీఈవో జి.వి.ఎస్‌.ఎస్‌.నాగేశ్వరరావు తెలిపారు. జల్లూరు జెడ్పీ హైస్కూల్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్ధులను కలుసుకుని వారి అభ్యసనా సామర్‌ాధ్యలు, విద్యా ప్రగతి, పరీక్షల సన్నద్ధత గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి విద్యా ప్రమాణాలను పెంపొందించుకునేందుకు అనుసరించాల్సిన విధానాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. విద్యార్ధులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల పర్యవేక్షణతో పాటు ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి నాణ్యత, పరిశుభ్రత, ప్రమాణం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement