విద్యుత్‌షాక్‌తో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

Sep 10 2026 12:45 AM | Updated on Sep 10 2026 12:45 AM

ఒమ్మలి గ్రామంలో విషాదం

మాడుగుల రూరల్‌ : మండలంలో ఒమ్మలి గ్రామంలో పొలానికి వ్యవసాయ బోరు ద్వారా నీరు పెట్టేటప్పుడు విద్యుత్‌ మోటారు ఆన్‌ చేయగా ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌ తగిలి నల్లబోయిన శంకరావు (36) రైతు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఒమ్మలి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఒమ్మలి శివార్లలో గల తన వరి పంటకు వ్యవసాయ బోరు ద్వారా నీరు పెట్టే క్రమంలో మోటారు స్విచ్‌ ఆన్‌ చెయ్యగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు మృతుడు మామ మోదినాయుడు, స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ జి.నారాయణరావు బుధవారం రాత్రి తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఒక కుమారై, కుమారుడు ఉన్నారు. వీరు ఇరువురు స్థానిక జిల్లా పరిషత్‌ ప్రభుత్వ హైస్కూల్లో చదువుతున్నారు. శంకరరావు మృతదేహాన్ని అనకాపల్లి పోస్టుమార్టంకు పంపించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement