సమష్టిగా కృషి చేద్దాం
అనకాపల్లి : జీవీఎంసీ, మున్సిపాల్,ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ నెలాఖరుకు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, వైఎస్సార్‌సీపీ బలమైన అభ్యర్థులు పోటీలో గెలుపొందేలా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టడం జరుగుతుందని, గ్రామీణస్థాయి నుంచి ప్రజలు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని ఎదురుచూస్తున్నారని, రెండున్నరేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయకుండా ఎలా మోసం చేసిందో తెలియజేయాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి బలమైన గెలుపొందే నాయకులను పోటీలో నిలిచే విధంగా చర్యలు చేపట్టి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కార్పొరేటర్ ఆరు వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి, అబద్ధపు హామీలతో (సూపర్ సిక్స్ పథకాలు) కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అవుతున్నా పథకాలు అమలు చేయకుండా మరోసారి స్థానిక ఎన్నికల ముందు వృద్ధులకు ప్రభుత్వ పింఛన్లు అమలు చేస్తున్నట్టు మోసానికి పాల్పడుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. వారం రోజుల్లో పట్టణ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు 6300 గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీలో కుట్రలు కుతంత్రాలు చేయకుండా సరైన మార్గంలో పార్టీ కోసం పనిచేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మాజీ ఎంపీ బి.వి. సత్యవతి మాట్లాడుతూ పార్టీలో క్రీయశీలకమైన సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బీమా చేయించడం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు, కూటమి ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేశామన్నారు. కరోన వంటి కష్టకాలంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు పి.సతీష్‌వర్మ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు, వర్షాభావంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే, సీఎం చంద్రబాబు జిల్లాలో రెండుసార్లు పర్యటించినా కరువు జిల్లాగా ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. జగన్ పాలనకు, సీఎం చంద్రబాబు పాలనకు ప్రజల్లో ఇప్పటికే అవగాహన కలిగిందని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని ఎదురుచూస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, ప్రజలకు అనుకూలమైన అభ్యర్థులను బరిలోకి దించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్‌రాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80,81,84 వార్డు ఇన్‌చార్జులు కెఎం.నాయుడు, బొడ్డేడ శివ, కె.రాఘవ, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, అనకాపల్లి, కశింకోట మండలపార్టీ అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, జిలా అధికార ప్రతినిఽధి మళ్ల బుల్లిబాబు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో గెలుపునకు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, సమన్వయకర్త భరత్‌కుమార్
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ
విస్తృత స్థాయి సమావేశం


