రేషన్‌ బియ్యంలో కోత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యంలో కోత

Sep 9 2026 2:58 AM | Updated on Sep 9 2026 2:58 AM

● సుమారు కిలో వరకు తగ్గుదల ● సీపీఎం నేతల ఆగ్రహం

● సుమారు కిలో వరకు తగ్గుదల ● సీపీఎం నేతల ఆగ్రహం

సెల్స్‌మెన్‌తో మాట్లాడుతున్న

సీపీఎం మండల నేతలు

ముంచంగిపుట్టు: మండలంలోని కర్రిముఖిపుట్టు రేషన్‌ డిపో ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం తూకాలను మంగళవారం సీపీఎం మండల నాయకులు జీనబంధు, నారాయణ పరిశీలించారు. కార్డుదారుడికి ఇచ్చే మొత్తం బియ్యంలో అర కేజీ నుంచి కేజీ వరకు తక్కువగా రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా కర్రిముఖిపుట్టు డిపో పరిధిలో రేషన్‌ బియ్యం తూకాల్లో తేడాలు వస్తున్నాయని స్థానిక గిరిజనులు తమ దృష్టికి తెచ్చారన్నారు. దీంతో తాము స్వయంగా బియ్యం తూకాలను పరిశీలించగా తేడాలు ఉన్నట్లు స్పష్టమైందన్నారు. పీవీటీజీ గిరిజనులకు అందాల్సిన రేషన్‌ బియ్యంలో కోతలు విధించడం దారుణమని మండిపడ్డారు. రేషన్‌ సేల్స్‌మన్‌ను పిలిచి హెచ్చరించామని, మున్ముందు కూడా తూకా ల్లో తేడాలు వస్తే మండల కేంద్రంలోని జీసీసీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పరమేష్‌, వెంకటరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement