చౌడుపల్లి నీటి సంఘ అధ్యక్షుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చౌడుపల్లి నీటి సంఘ అధ్యక్షుడు మృతి

Sep 9 2026 2:58 AM | Updated on Sep 9 2026 2:58 AM

చింతపల్లి: మండలంలోని చౌడుపల్లి నీటి సంఘం అధ్యక్షుడు కంఠా వెంకటరమణ (65) మంగళవారం మృతి చెందారు. ఆయన గతంలో ఇదే పంచాయతీకి ఉప సర్పంచ్‌గా సేవలందించడమే కాకుండా, మండలంలో ఉత్తమ ఆదర్శ, అభ్యుదయ రైతుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఆయన కుమార్తె జాహ్నవి ప్రస్తుతం వ్యవసాయశాఖ యలమంచిలి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement