గర్భిణులకు ఉచిత భోజనం | - | Sakshi
Sakshi News home page

గర్భిణులకు ఉచిత భోజనం

Sep 9 2026 2:58 AM | Updated on Sep 9 2026 2:58 AM

సీలేరు: మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు సీలేరు బాలాజీ రెస్టారెంట్‌ యజమాని నక్క జ్ఞానేశ్వర్‌ రావు తెలిపారు. ప్రతి నెల 9వ తేదీన నిర్వహించే క్రమబద్ధ వైద్య పరీక్షల (పీఎంఎస్‌ఎంవై) కోసం వచ్చే గర్భిణులకు ఆసుపత్రి ప్రాంగణంలోనే మధ్యాహ్నం ఉచితంగా నాణ్యమైన భోజనం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఆసుపత్రిలో ప్రసవమై (డెలివరీ) వార్డులో ఉన్న బాలింతలకు రోజువారీగా మధ్యాహ్న భోజనాన్ని ఆసుపత్రికే స్వయంగా తీసుకొచ్చి అందిస్తామన్నారు. వైద్యాధికారి అందించే చీటీ చూపిస్తే ఆసుపత్రి వద్ద లేదా రెస్టారెంట్‌లో తక్షణమే భోజనం అందజేస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని సీలేరు పరిసర మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు, గర్భిణులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement