ఓటర్ల జాబితాలో ఇతర పంచాయతీ ఓట్లు | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితాలో ఇతర పంచాయతీ ఓట్లు

Sep 8 2026 12:29 AM | Updated on Sep 8 2026 12:29 AM

● తహసీల్దారుకు వైఎస్సార్‌సీపీ నేత ఫిర్యాదు

నాతవరం: క్షేత్రస్థాయిలో అధికారులు చేసిన తప్పిదాలు కారణంగా తమ పంచాయతీలోని ఓటర్ల జాబితాలో ఇతర పంచాయతీకి చెందిన 50పైగా ఓట్లు చేరాయని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయుకుడు గుడపర్తి అచ్చియ్యనాయుడు ఆరోపించారు. ఆయన సోమవారం తహసీల్దార్‌ ఒ. చందనరేఖ, ఎంపీడీవో శ్రీనివాస్‌లను కలిిసి ఫిర్యాదు చేశారు. తప్పుడు ఓటర్ల జాబితాను చూపించడంతో సదరు అధికారులు అవాక్కయ్యారు. మండలంలో వెదురుపల్లి పంచాయతీ శివారు కొవడటిపూడి గ్రామానికి చెందిన 50పైగా ఓట్లు రాజుపేట అగ్రహారం పంచాయతీ ఓటర్లు జాబితాలో చేరాయన్నారు. రాజుపేట అగ్రహారం పంచాయతీలోని 8 వార్డుల్లో ఓటర్లుగా నమోదు చేశారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు చేసిన పొరపాట్లను ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఓటర్ల జాబితా సక్రమంగా తయారు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ ఎంపీడీవో శ్రీనివాస్‌తో కలిసి రెండు పంచాయతీలను సందర్శించి పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలించి ఓటర్ల జాబితా సరి చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement