జేసీ తిరుమణి శ్రీపూజ
సాక్షి,పాడేరు: కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు తప్పని సరిగా సమయపాలన పాటించాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. కలెక్టరేట్ అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని విభాగాల ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈసమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌వో లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారులు,అన్ని విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.


