చింతపల్లి: గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావు సూచించారు. సబ్ డివిజనల్ పరిధి సీఐలు, ఎస్‌ఐలతో సోమవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటు, నిమజ్జనం సమయంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిమజ్జనం సమయంలో విధిగా పోలీసు బందోబస్తు ఉండాలని తెలిపారు. ప్రతి గణేష్ మండపానికి విధిగా అనుమతి ఉండాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. చింతపల్లి సీఐ సింహాచలం, కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్, ఆయా స్టేషన్ల ఎస్‌ఐలు పాల్గొన్నారు.
డీఎస్పీ తిరుపతిరావు


