ఎంవీపీకాలనీ: జలవనరులశాఖ ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజినీర్ (సీఈ)గా డి.తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఈగా ఉన్న రామ్‌గోపాల్ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో, తిరుమలరావును ఆ స్థానంలో నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సోమవారం ఉషోదయ జంక్షన్‌లోని కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. గతంలో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ధవళేశ్వరంలో ఎస్‌ఈగా విధులు నిర్వర్తిస్తూ, పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. పలువురు విభాగ ఇంజినీరింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యుటీ ఇంజినీర్ శ్రీహరి, ఈఈ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


