పాడుతా తీయగా విజేతలకు బహుమతులు | - | Sakshi
Sakshi News home page

పాడుతా తీయగా విజేతలకు బహుమతులు

Sep 1 2026 12:55 AM | Updated on Sep 1 2026 12:55 AM

అనకాపల్లి: స్థానిక గవరపాలెం సంతోషిమాత అమ్మవారి ఆలయం వద్ద పాడుతూ తీయగా పాటల పోటీలు ఆదివారం రాత్రి ముగిసాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 50మంది సింగర్స్‌ వచ్చి పాటలు పాడారు. న్యాయనిర్ణేతలుగా సంగీత దర్శకుడు ఇంద్రగంటి లక్ష్మీశ్రీనివాస్‌, ప్రముఖ అధ్యాత్మిక విద్యావేత్త, ప్రవచన కర్త, నంది అవార్డు గ్రహీత అల్లాడ బాలసౌజన్యకుమారి వ్యవహరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాటలు మానసిక ఉత్సాహానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి ప్రియగీతకు (అనకాపల్లి)రూ.5వేలు, ద్వితీయ బహుమతి నిత్యప్రియ(కశింకోట)రూ.3వేలు, తృతీయ బహుమతి డి.జగదీశ్వరి(నాగులాపల్లి)రూ.2వేలు, కన్సొలేషన్‌ బహుమతులుగా ఐదుగురికి రూ.వేయి చొప్పన నగదు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ మారిశెట్టి భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement