పాడేరు: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ రోజురోజుకూ బలపడుతోంది. నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకంతో ఇతర పార్టీల నుంచి చేరికలు అధికమవుతున్నాయి. ఇప్పటికే చాలామంది రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ క్రమంలో శనివారం మండలంలోని గుత్తులపుట్టు, వంట్లమామిడి పంచాయతీలకు చెందిన సుమారు 100 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరారు. వంట్లమామిడికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, పీసా కమిటీ అధ్యక్షులు వంతాల చిట్టిబాబు, మాజీ వార్డు సభ్యులు ఉల్లి రామారావు, అల్లంగి చిన్న పోతురాజు, పీసా కమిటీ అధ్యక్షులు బోయిని రాంబాబు, నాయకులు మాదెల నూకరాజు, వంతాల కోటేశ్వరరావు, సీదరి సత్తిబాబు, వంతాల కళ్యాణ్ తదితరులు ఉన్నారు. అలాగే గుత్తులపుట్టు పంచాయతీకి చెందిన సింహాచలం, అర్జున్, త్రినాథ్, వెంకట్, నాగరాజు, కొండమ్మ, చిన్నయ్య, శ్రీను, కుమారి, పండన్న, కొండలరావు తదితరులు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పార్టీలోకి వచ్చిన వారందరికీ సాదరంగా ఆహ్వానం పలికారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు
సమక్షంలో చేరిన టీడీపీ నేతలు


