హాష్‌ ఆయిల్‌, గంజాయి దహనం | - | Sakshi
Sakshi News home page

హాష్‌ ఆయిల్‌, గంజాయి దహనం

Jul 11 2026 1:24 AM | Updated on Jul 11 2026 1:24 AM

పరవాడ: మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ), ఈగల్‌ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గంజాయి నిర్మూలన కార్యక్రమం నిర్వహించినట్లు పరవాడ సీఐ ఎల్‌.భాస్కరరావు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఆరు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 767.4 కిలోల గంజాయి, 4.036 లీటర్ల హాష్‌ ఆయిల్‌ను కోర్టు అనుమతితో రాంకీ ఫార్మాసిటీలోని అత్యాధునిక ఇన్సినరేషన్‌ ప్లాంట్‌లో పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా శుక్రవారం దహనం చేశారు. కార్యక్రమంలో ఈగల్‌ ఎస్పీ జి.స్వరూపరాణి, ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ పంకజ్‌ కుమార్‌ ద్వివేది, సూపరింటెండెంట్‌ రాజన్‌ కుమార్‌, ఇంటెలిజెన్స్‌ అధికారి కె.కిరణ్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ డ్రగ్స్‌ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు. ఈగల్‌ విభాగం ఇన్‌స్పెక్టర్లు జి.దేముడు, డాక్టర్‌ కల్యాణ్‌, ఈగల్‌ సెల్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement