ప్రతిభ కనబరిచిన విద్యార్థి మోనిష్ కుమార్
పాయకరావుపేట : మంగళవారం ప్రకటించిన ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థి జె.మోనిష్ కుమార్ ఆల్ ఇండియా లెవెల్ ఓబీసీ క్యాటగిరీలో 15వ ర్యాంకు ఓపెన్ క్యాటగిరీలో 107 వ ర్యాంకు సాధించాడని కళాశాల ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎస్ భానుమూర్తి తెలిపారు. తమ కళాశాలలో 6 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ఇస్తున్న 7 సంవత్సరాల క్లాస్ రూమ్ ప్రోగ్రాంతో పాటుగా వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ ద్వారా తమ విద్యార్థులు ఈ విజయాలను సాధిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్. విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.


