నేడు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా సమావేశం

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అరకులోయ టౌన్‌: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగాలకు చెందిన అధ్యక్షులు, కమిటీ సభ్యుల సమావేశం ఈనెల 9వ తేదిదీ గురువారం ఉదయం 10 గంటలకు తన క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని గ్రామ, వార్డు, కోర్‌ కమిటీలు, అనుబంధ విభాగాల ఎంపిక, డిజిటైలేషన్‌ కార్యక్రమాలు పూర్తయిందన్నారు. ప్రస్తుతం సభ్యుల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందన్నారు. కొంత మంది కమిటీ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన లేకపోవడం వల్ల డిజిటైలేజేషన్‌ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. అందువల్ల సోషల్‌ మీడియా విభాగాలకు చెందిన అధ్యక్షులు, కమిటి సభ్యులు విధిగా హాజరు కావాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement