విజేతలకు బహుమతులు అందజేస్తున ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా
ఆరిలోవ : పోలీసులకు పని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు, వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని విశాఖ రేంజ్ ఐజీ గోపినాఽథ్ జట్టి తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాలాక్షినగర్ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సంబరాలు సోమవారం ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో ఐజీ పాల్గొని విజేతలను అభినందించారు. అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం, సబ్ డివిజన్లతో పాటు ఆర్మడ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ మీట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి బహుమతులు అందజేశారు. అనంతరం ఐజీ గోపినాథ్ మాట్లాడుతూ పోలీసులు పని ఒత్తిడిని అధిగమించి మానసిక ఉల్లాసం పొందేందుకు యోగా, వ్యాయామం, క్రీడలను తమ దైనందని జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి ఎస్పీ తుమిన్ సిన్హా మాట్లాడుతూ పోలీసులు మరింత ఉత్సాహంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అదనపు ఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


