రైతుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
జీకే వీధి/సీలేరు: జీకే వీధి మండలం ఎ.దారకొండ పంచాయతీ పరిధిలోని ఎ.దారకొండ గ్రామంలో సోమవారం భారీ విష సర్పం కలకలం రేపింది. సుమారు 15 అడుగుల పొడవు గల పాము రైతుల కంటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో రైతులు టమాటా పంట పొలాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ సందర్భంగా విష సర్పం ఒక్కసారిగా దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆనందరావు అనే రైతు చాకచక్యంగా తప్పించుకుని ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అనంతరం అక్కడున్న మిగతా రైతులతో కలిసి పామును హతమార్చారు. పొలాల్లో పనిచేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచించారు.


