ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం పంచాయతీ మొక్కపుట్టు,లబడపుట్టు గ్రామాల్లో గాలి,వాన బీభత్సం సృష్టించాయి.ఆదివారం రాత్రి భారీగా ఈదురు గాలులు వీచాయి. ఏకధాటిగా వర్షం పడింది.పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. గాలులకు ఏడు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలో ఉన్న సామగ్రి,ధాన్యం,సామలు తదితర సరుకులు పాడైపోయాయి. ఆర్థికంగా నష్టపోయామని,ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని మొక్కపుట్టు,లబడపుట్టు గ్రామాల బాధిత కుటుంబాలవారు వేడుకున్నారు.
సీలేరు: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వారం రోజులుగా వింత వాతావరణ చోటు చేసుకుంటోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండకాస్తోంది. అనంతరం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. సీలేరులో సోమవారం అరగంటపాటు భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు రావడంతో అందరూ అప్రమత్తమై, ఇళ్లకు పరిమితమయ్యారు.
ఎగిరిపోయిన ఏడు ఇళ్ల పైకప్పు రేకులు


