సూపర్‌ సిక్స్‌ పేరుతో దగా | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌ పేరుతో దగా

Mar 24 2026 7:51 AM | Updated on Mar 24 2026 7:51 AM

అరకులోయటౌన్‌: సూపర్‌సిక్స్‌ పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, ముఖ్యంగా నిరుద్యోగులు, మహిళలను బురిడీకొట్టించిందని వైఎస్సార్‌సీపీ అరకులోయ పార్లమెంట్‌ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధ్యక్షతన స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ ఎస్టీ సెల్‌ ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కూటమి నాయకులు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకే ష్‌లు చేసిన వాఖ్యలను కూటమి పార్టీల్లో ఉన్న బీజేపీ నాయకుడు సుజనా చౌదరి ఖండించారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల కింద రూ. 2లక్షల 80వేల కోట్లను నేరుగా లబ్ధిదారులకు అందించిన ఏకై క ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్త విధిగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం తీసుకున్నవారికి భవిష్యత్తులో వారికి పార్టీ గుర్తింపు కార్డుతోపాటు ఇన్సూరెన్స్‌ వంటి సౌకర్యాలు పొందే అవకాశం ఉందన్నారు.

వైఎస్సార్‌సీపీ అరకులోయ అసెంబ్లీ పరిశీలకుడు బోనాల శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ వెంటే ఉంటారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలను నియమిస్తున్నారని, అరకులోయ అసెంబ్లీనియోజకవర్గ పరిధిలో శతశాతం కమిటీల నియామకం వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే కచ్చితంగా కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నను సీఎం చేస్తేనే మనందరికీ భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకంలో పనులు చేయకుండా బిల్లులు మార్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తే తాము కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లగా దానిని ఉపసంహరించుకున్నారన్నారు. అంతకు ముందు గౌరవ అతిథులకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావు,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, రాష్ట్ర ఎస్టీ సెల్‌ సంయుక్త కార్యదర్శి తడబారికి సురేష్‌ కుమార్‌, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్‌, జెడ్పీటీసీలు చటారి జానకమ్మ, ఎంపీపీలు బాక ఈశ్వరి, తడబారికి మిధుల, ఎంపీటీసీ దురియా ఆనంద్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్‌, పార్టీ మండల అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్‌, అనిల్‌, కొర్రా సూర్యనారాయణ, చంద్రుబాబు, ఉపాధ్యక్షులు పల్టాసింగి విజయ్‌కుమార్‌, గుడి వాడ ప్రకాష్‌, నియోజకవర్గ కల్చరల్‌ వింగ్‌ అధ్యక్షుడు పెట్టెలి సుక్రయ్య, సర్పంచ్‌ రాధిక, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి పాల్గొన్నారు.

అరకు పార్లమెంట్‌ పరిశీలకుడు సీహెచ్‌. వెంకటరామయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement