పాడేరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పనిచేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల నియమించిన గ్రామ కమిటీలు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే లక్ష్యంతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి, డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా కార్యకర్తకు భద్రత కల్పించే విధంగా పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. వచ్చే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు మేలు జరుగుతుందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ ఏడువాక సత్యారావులు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాలు, అన్యాయాలను కార్యకర్తలు ప్రజల్లో తీసుకువెళ్లాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్య దర్శి సీదరి మంగ్లన్నదొర, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, ఎంపీపీలు కోరాబు అనూషాదేవి, బోయిన కుమారి, బడుగు రమేష్, పార్టీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండం నాయు డు, కంకిపాటి గిరిప్రసాద్, బిడిజన అప్పారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వసుపరి తిమో తి, పంచాయతీ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, మహిళ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జయితి రాజులమ్మ, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అచ్యుత్, నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశీరాణి, ఎస్టీ సెల్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


