మోదమ్మ ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

మోదమ్మ ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

Mar 24 2026 7:51 AM | Updated on Mar 24 2026 7:51 AM

పాడేరు: మోదకొండమ్మ ఉత్సవాలను ఈ ఏడాది మే 10,11,12 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. ఉత్సవాల పోస్టర్లను సోమవారం ఉదయం అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పట్టణ ప్రముఖులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ జాతర సందర్భంగా మూడు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పాడేరు పట్టణమంతా భారీ విద్యుత్‌దీపాంలకరణ, భారీ సెట్టింగులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. అమ్మవారి ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలు, భక్తులు, అధికారులు, అనాధికారులు, ప్రజాప్రతినిధులు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement