ఏపీజేఏసీ తాలూకా కమిటీ కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఏపీజేఏసీ తాలూకా కమిటీ కార్యవర్గం ఎన్నిక

Mar 22 2026 1:49 AM | Updated on Mar 22 2026 1:49 AM

చింతపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, కర్షక, పెన్షనర్ల ఐక్య కార్యచరణ సమితి చింతపల్లి తాలూకా చైర్మన్‌గా బుక్క చిట్టిబాబు, జనరల్‌ కార్యదర్శిగా దేపూరి శశికుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం స్థానిక గిరిజన్‌ భవన్‌లో రాష్ట్ర, జిల్లా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆదేశాల మేరకు జిల్లా జేఏసీ జనరల్‌ సెక్రటరీ యు.వి.గిరి, కో చైర్మన్‌ కుడుములు వెంకటరమణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సేవా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కో చైర్మన్లుగా జి.తిరుపతిబాబు, కె.సత్తిబాబు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా కె.వెంకటేష్‌, కోశాధికారిగా కె.బాబూరావు, వైస్‌ చైర్మన్లుగా వీరయ్యదొర, పి.వి.రమణ, సురేష్‌కుమార్‌, కృష్ణమూర్తితో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు చిట్టిబాబు, శశికుమార్‌ మాట్లాడుతూ చింతపల్లి తాలూకాలో సమస్యలపై కార్యవర్గ సభ్యులు సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన అన్ని సంఘాల క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement