ఈద్‌ ముబారక్‌ | - | Sakshi
Sakshi News home page

ఈద్‌ ముబారక్‌

Mar 22 2026 1:49 AM | Updated on Mar 22 2026 1:49 AM

సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు శనివార ఘనంగా జరిగాయి. నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు రంజాన్‌ సందర్భంగా ఉదయాన్నే మసీదుల్లో ప్రత్యేక నమాజ్‌ చేశారు. పాడేరులోని పురాతన జక్రీ ఇలాహి జామియా మసీదులో గురువు ఎస్‌.కె.అలీ ఆధ్వర్యంలో ప్రార్థనలు అనంతరం పాడేరు మెయిన్‌ రోడ్డులో శాంతి ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులకు, వర్తకులకు ముస్లిం పెద్దలు స్వీట్లు పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా ముస్లీం కుటుంబాలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సుండ్రుపుట్టులోని దర్గా ప్రాంతంలో ముీస్లింలు లోక కల్యాణార్థం నమాజ్‌ చేశారు. తమిళనాడు ముస్లిం కుటుంబాలు కూడా స్థానిక జమాత్‌, గుత్తులపుట్టు మసీదుల్లో నమాజ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement