అనకాపల్లి: అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు విశాఖ రేంజ్ పోలీసు ఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. గరవపాలెం నూకాంబిక అమ్మవారిని శనివారం గోపినాథ్ జట్టి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే సమీపంలో పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలన్నారు. ఐజీ దంపతులను ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ సత్కరించారు.


