సీలేరు: దారకొండ గ్రామంలో వెలసిన గ్రామ దేవత దారాలమ్మ అమ్మవారికి శుక్రవారం బంగారు ముక్కుపుడకను వితరణగా అందజేశారు. దారకొండ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి పైలా చిన్నబాబు, కొండమ్మ దంపతుల కుమారుడు రవికిరణ్, అనూష దంపతులు ఈ కానుకను సమర్పించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న రవికిరణ్, ప్రతి ఏటా అమ్మవారి పండుగకు విచ్చేసి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి చేయించిన బంగారు ముక్కుపుడకను ఆలయ అర్చకుడు ప్రసాద్‌కు అందజేశారు. దాతల భక్తిశ్రద్ధలను ఆలయ కమిటీ, స్థానికులు అభినందించారు.


