అరకులోయటౌన్: మానవుని యొక్క సర్వతోముఖాభివృద్ధి అడవులతోనే ముడిపడి ఉందని అరకులోయ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బొర్రా కోటేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్ ఆదేశాల మేరకు వృక్షశాస్త విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకుడు పి.నాగబాబు అధ్యక్షతన శుక్రవారం అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అటవీ రేంజ్ ఆఫీసర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ అడవుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. అటవీ శాఖ ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా అటవీ సంరక్షణ కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ఫారెస్ట్ సెక్షెన్ ఆఫీసర్ కృష్ణం నాయుడు మాట్లాడుతూ మొక్కలను నాటి అడవులను అభివృద్ది చేయాలన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పి.ఉద్దంగి అడవుల సంరక్షణపై విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. వృక్ష శాస్త్ర అధ్యాపకుడు బి. లచ్చన్న థీమ్, అడవులు, ఆర్థిక వ్యవస్థలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ఆవరణలో యూజీనియా అలంకరణ మొక్క లు నాటారు. ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు విజయలక్ష్మి, అనిత కుమారి, అధ్యాపకులు కృష్ణమోహన్, సుందరిరాణి, వి.కామేశ్వరరావు, రాజు, సోంబాబు పాల్గొన్నారు.


