గూడెంకొత్తవీధి: కాఫీ కొనుగోళ్ల విషయంలో జీసీసీ అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఈనెల 23న కాఫీ రైతులతో కలసి జీసీసీ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహిస్తామని గాలికొండ ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాఫీ రైతులకు ఈ ఏడాది జీసీసీ తీరని అన్యాయం చేసిందన్నారు. సరియైన సమయంలో రైతుల నుంచి కాఫీ కొనుగోలు చేయకుండా చేతులెత్తేసిందన్నారు. చివరికి గిరిజనులకు దళారులే దిక్కయ్యారన్నారు. కాఫీ రైతులకు అన్యాయం చేసిన జీసీసీ తీరును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియ జేస్తామని బుజ్జిబాబు అన్నారు.


