సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన

Feb 3 2026 7:31 AM | Updated on Feb 3 2026 7:31 AM

సాగు

సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన

● డీఆర్‌వో సత్యనారాయణరావు ● కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు 215 , రెవెన్యూ క్లినిక్‌కు 276 అర్జీలు

● డీఆర్‌వో సత్యనారాయణరావు ● కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు 215 , రెవెన్యూ క్లినిక్‌కు 276 అర్జీలు

రెవెన్యూ క్లినిక్‌లతో

భూసమస్యల పరిష్కారం

తుమ్మపాల : భూ సంబంధిత సమస్యలను రెవిన్యూ క్లినిక్‌ ద్వారా సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం–1 , 2 లో వెర్వేరుగా నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలలో ఆయనతో పాటు పీజీఆర్‌ఎస్‌ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ రామమణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, డివిజన్‌, మండల, గ్రామస్థాయిలలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్‌లో ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్‌.సుబ్బలక్ష్మి, మనోరమ, అనిత రెవెన్యూ సంబంధిత అర్జీలను స్వీకరించి పరిష్కార మార్గాలపై సంబంధిత మండల అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. పీజీఆర్‌ఎస్‌కు 215, రెవిన్యూ క్లినిక్‌కు 276 మొత్తం 491 అర్జీలు నమోదయ్యాయి. డీఆర్‌డీఏ, మెప్మా, ఐసీడీఎస్‌ పీడీలు శచిదేవి, కె.సరోజిని, సూర్యలక్ష్మి, జిల్లా ఎక్త్సెజ్‌ అధికారి వి.సుధీర్‌, జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్‌, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకుడు గోపాల్‌ రాజా పాల్గొన్నారు.

ఎస్సీఎస్టీలకు అదనపు నిధులివ్వాలి :

విస్తృత దళిత సంఘాల వినతి

ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛను అమలు, జనాభా నిష్ఫత్తి 2026 – 27 ఆధారంగా బడ్జెట్‌లో సబ్‌ప్లాన్‌ ద్వారా రూ.40 వేల కోట్లు కేటాయించాలంటూ విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ నెల 14న ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయింపుపై ఎస్సీ ఎస్టీ ప్రతినిధుల అభిప్రాయం తీసుకుని ఎస్సీలకు పింఛను అమలు కోసం అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించాలని, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, అంగన్‌వాడీ, ప్రాథమిక, ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాలు కోసం రూ.5 వేల కోట్లు కేటాయించాలని, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు ఈ ఆర్థిక సంవత్సరం మార్చిలోపే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా అధికారులకు వినతి అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కన్వీనర్‌ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు మట్ల అప్పారావు, ఆర్‌.కోయిష్మా, రేవిడి కృష్ణ పాల్గొన్నారు.

ఓవర్‌లోడ్‌ ట్రక్కుల కాలుష్యంపై ఫిర్యాదు

సింహాద్రి ఎన్టీపీసీ, ఫార్మాసిటీ, ఎస్‌ఈజెడ్‌, హిందూజా వంటి పరిశ్రమలకు వెళ్లే ఓవర్‌ లోడు ట్రక్కులతో వాయుకాలుష్యం తీవ్రంగా పెరిగిపోయి అనేక ప్రమాదాలతో పాటు లంకెలపాలెం పరిసరాల్లో నివసించే ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని, తక్షణమే అధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని ఆయా పరిసరాల ప్రజలు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. బొగ్గు, తడి పొడి ఫ్లైయాష్‌ తరలిస్తున్న ట్రక్కులు టార్పాలిన్‌లు కప్పకపోవడంతో పొడి బూడిద గాలిలోనికి ఎగిసిపడుతుందని, తడి బూడిద రోడ్డుపై పడి రోడ్డును దుమ్ము ధూళితో కమ్మేస్తుందని, కళ్ల మంటలు, గొంతు, ముక్కు శ్వాస కోశ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపరాఉ. అధికారులు తక్షణమే కాలుష్యకారక ట్రక్కులను నిరోధించాలని కోరుతూ డీఆర్‌వోకు వినతి అందించారు.

జిల్లా కలెక్టర్‌కు మునగపాక వాసుల వినతులు

మునగపాక: స్థానిక బీసీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న పూర్వ హాస్టల్‌ భవనాన్ని డాక్టర్‌ అంబేడ్కర్‌ సామాజిక భవనానికి కేటాయించాలని కలెక్టర్‌కు దళిత సంఘాల నేతలు వినతి అందజేశారు. ఏళ్ల తరబడి విద్యార్థులు లేకపోవడంతో పూర్వ హాస్టల్‌ భవనం నిరుపయోగంగా ఉందని అంబేడ్కరిజమ్‌ పునాది అసోసియేషన్‌ కన్వీనర్‌ రాజాన బుజ్జిబాబు తెలిపారు. వినతి అందజేసిన వారిలో దళిత నాయకులు ఎంఎ అప్పలరాజు, బోని గణేష్‌, మైలపల్లి పోతురాజు, రేబాక మదుభాబు, మైలపల్లి అప్పలనరసయ్య, పిట్టా అప్పారావు, చెక్కా అప్పారావు, లంబా అర్జునరావు ఉన్నారు. మునగపాక సంతబయిలలో ఏళ్ల క్రితం నిర్మించిన కల్వర్టు దెబ్బతినడంతో రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారంటూ సర్పంచ్‌ దిమ్మల అప్పారావు కలెక్టర్‌కు వినతి అందజేశారు. గ్రామంలో ఏళ్లక్రితం నిర్మించిన రహదారులు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు గురయ్యాయని, ఇందుకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయాలని కోరినట్లు సర్పంచ్‌ తెలిపారు.

పరిశ్రమల కాలుష్యం నుంచి

విముక్తి కల్పించాలి

కశింకోట: మండలంలోని ఏఎస్‌ పేట గ్రామం వద్ద మూడు ప్రైవేటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం నుంచి తమ గ్రామస్తులకు, రైతుల భూములకు రక్షణ కల్పించడానికి, భారీ వాహనాల రాకపోకల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ను గొబ్బూరు గ్రామ రైతు బుద్ధ వెంకటరమణ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసి వేర్వేరుగా వినతి పత్రాలు సమర్పించారు.

సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన 1
1/4

సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన

సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన 2
2/4

సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన

సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన 3
3/4

సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన

సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన 4
4/4

సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement