వ్యాన్‌లో కుక్కి పశువుల అక్రమ రవాణా
నక్కపల్లి : ఇరుకై న వ్యాన్‌లో క్రూరంగా పశువులను కుక్కి అక్రమంగా రవాణా చేస్తున్న బొలేరో వాహనాన్ని సోమవారం నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీఐ మురళికి అందిన సమాచారం మేరకు వేంపాడు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేయడం జరిగిందన్నారు. మానాపురం నుంచి సామర్లకోట వరకు బొలేరో వాహనంలో 18 ఎడ్లు, ఒక ఆవును రెండు అరల్లో బలవంతంగా కుక్కి తీసుకెళ్తున్నట్టు గుర్తించడం జరిగిందన్నారు. ఈ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఈ పశువులను తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. పరిమితికి మించి పశువులను అత్యంత క్రూరంగా ఊపిరి ఆడకుండా అరలు అమర్చ్ని చిన్న బొలేరో వాహనంలో తరలించడం వల్ల ఒక ఆవు మృతి చెంది ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆవులను కుక్కి తరలిస్తున్న సంఘటనపై బొలేరో వాహనంతో పాటు, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వాహనంతోపాటు పశువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అత్యంత క్రూరంగా పశువులను చిన్నవాహనంలో రెండు అరలు అమర్చి తరలిస్తున్నారని ఎస్‌ఐ తెలిపారు.
వ్యాన్‌లో కుక్కి పశువుల అక్రమ రవాణా
వ్యాన్‌లో కుక్కి పశువుల అక్రమ రవాణా


