ఘనంగా ముగిసిన దేవీతల్లి తీర్థం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగిసిన దేవీతల్లి తీర్థం

Feb 3 2026 7:31 AM | Updated on Feb 3 2026 7:31 AM

ఘనంగా ముగిసిన దేవీతల్లి తీర్థం

ఘనంగా ముగిసిన దేవీతల్లి తీర్థం

● హోరా హోరీగా జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు

● హోరా హోరీగా జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు

ఉమామహేశ్వరీ దేవి దర్శనం కోసం పోట్తెతిన భక్తులు

దేవరాపల్లి: స్థానిక గ్రామ ప్రజల ఆరాధ్య దైవం ఉమామహేశ్వరీ దేవి (దేవీతల్లి) తీర్థ, కళ్యాణ మహోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల తీర్థ మహోత్సవాలలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారిని తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు హోరా హోరీగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి విజేతలకు వరుసగా రూ. 20 వేలు, రూ. 18 వేలు, రూ. 16 వేలు, రూ. 14 వేలు, రూ. 12 వేలు, రూ. 10 వేలు, రూ. 8 వేలు, రూ. 6 వేలు, రూ. 4 వేలు, రూ. 2 వేలు చొప్పున నగదు బహుమతులను అందించారు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement