సమస్యల పరిష్కారానికి కృషి
అర్జీదారుల సమస్యను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయానికి సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 66 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా తమ కార్యాలయంలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ తగాదాలు–32, మోసపూరిత వ్యవహరాలు–3, కుటుంబ కలహాలు–2, ఇతర విభాగాలకు చెందినవి–29 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. చట్టపరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


