డీపీఆర్‌లు సిద్ధం చేయాలి
● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు డీపీఆర్‌లు సిద్ధం చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్‌లో పలుశాఖల అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ,ఉద్యాన అనుబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాడేరు, అరకులోయ, చింతపల్లి, చింతూరు ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన,పర్యాటక అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ,అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్,పలుశాఖల అధికారులు,జీసీసీ మేనేజర్లు పాల్గొన్నారు.


