ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత
● భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజుబాబు
గూడెంకొత్తవీధి: ప్రభుత్వ ఉద్యోగుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజుబాబు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులపై పనిభారం పెంచడం వల్ల వారంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. కొయ్యూరు తహసీల్దారు ఎస్‌ఎల్‌వీ ప్రసాద్ గుండె పోటు మరణానికి ప్రభుత్వ ప్రభుత్వ ఒత్తిడే కారణమన్నారు. తమ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుందని చెప్పుకోవడానికి ఉద్యోగులపై చంద్రబాబు ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు రాక్షసత్వంతో ఉద్యోగులను హింసించడం మానుకోవాలన్నారు. ఒత్తిడి వల్ల ఉద్యోగులకు బీపీ, షుగర్, గుండెపోటు వస్తున్నాయన్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చి ఉద్యోగులకు పనిభారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


