ఉపాధి హామీ హక్కును హరిస్తే ఊరుకోం
మితిమీరిన వేగంతోవాహనాలు నడిపితే చర్యలు
చింతపల్లి: వాహన దారులు మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని సీఐ వినోద్‌బాబు హెచ్చరించారు. బుధవారం ఇక్కడ జరిగిన వారపు సంతలో డిగ్రీ కళాశాల వద్ద వాహనచోదకులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ద్విచక్ర వాహన దారులు చింతపల్లి మెయిన్ రోడ్డులో ప్రజలకు ఇబ్బంది కలిగేలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాడేరు : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మార్పు పేరు చెప్పి ఉపాధి కూలీల హక్కును హరిస్తే ఊరుకునేది లేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పాలికి లక్కు హెచ్చరించారు. ఈ మేరకు ఉపాధి హామీ కూలీలతో కలిసి మండలంలోని మోదాపల్లి పంచాయతీ గుర్రగరువులో కరపత్రాలతో నిరసన తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. శతశాతం పనులు కల్పించడం లేదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాసేందుకే కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఉపాధి హామీ చట్ట ప్రకారం 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేదని కానీ ఇప్పుడు కేవలం 60శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం భరించి 40 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం మార్చి పాత చట్టాన్ని కొనసాగించేంత వరకు ఉపాధి హామీ కూలీల తరఫున సీపీఎం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం వేతనదారులు సత్తిబాబు, బాలరాజు, ప్రకాష్, రాజులఅమ్మ, ఎంకమ్మ, సీపీఎం పార్టీ నాయకులు సూరిబాబు, మురళీమోహన్ పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో కూలీల హెచ్చరిక


