వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం
● ఆ పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు ఏరువాక సత్యారావు
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధ్యక్షతన విస్తృత స్థాయి మండల సమావేశం
డుంబ్రిగుడ: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం చేయాలని అరకు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు ఏరువాక సత్యారావు సూచించారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి భవన్ వద్ద పార్టీ మండల అధ్యక్షుడు పి.పరశురామ్ అధ్యక్షతన బుధవారం పార్టీ మండలస్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో గ్రామ కమిటీలు ఏర్పాటుచేయాలని సూచించారు. తొమ్మిది మందికి తగ్గకుండా కమిటీ ఏర్పాటు చేయాలని, వీటిని ఈనెల 31లోగా పూర్తి చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. జిల్లా, మండల నాయకులు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని మాత్రమే గ్రామ కమిటీల్లో నియమించాలని పార్టీ నేతలకు సూచించారు. మండలంలోని ఖాళీగా ఉన్న పదవులు త్వరలో భర్తీ చేస్తామన్నారు. పార్టీకి ఎవరైనా చెడ్డ పేరు తీసుకువస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈసమావేశంలో ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ చటారి జానకమ్మ, వైస్ ఎంపీపీలు శెట్టి ఆనందరావు, పి లలిత, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కె.హరి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు బి.శాంతి, స్వచ్ఛాంద్ర మాజీ డైరెక్టర్ సోమేశ్వరి, మాజీ జడ్పీటీసీ ఎం శ్రీరాములు, పోతంగి, గుంటసీమ సర్పంచ్‌లు వెంకటరావు, గుమ్మ నాగేశ్వరరావు, మండల కార్యదర్శులు మఠం శంకరరావు, లీలారణి, రామునాయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు గణపతి, నాయకులు బాకా సింహాచలం, కృష్ణరావు, కమ్మిడి నిర్మల, బి. మోహన్‌రావు, నర్సింగరావు పాల్గొన్నారు.
కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరికి గుర్తింపు
హుకుంపేట: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయాలని, కష్ట పడి పనిచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి నామినేటెడ్ పదవులను పార్టీకోసం క్రియాశీలకంగా పనిచేసే వారితో భర్తీ చేస్తామన్నారు. పార్టీ గ్రామ కమిటీలో సభ్యులుగా తొమ్మిది మంది నుంచి 15 మంది వరకు నియమించుకోవచ్చన్నారు. కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడాన్ని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు వివరించారు. ఇదే స్ఫూర్తితో గ్రామ కమిటీల ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు ఏరువాక సత్యారావు గ్రామ కమిటీల ఏర్పాటుపై సూచనలు చేశారు. పార్టీకోసం పనిచేసే వారికి అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాంగి అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవి ప్రసాద్, రాష్ట్ర జాయింట్ కార్యదర్శి సురేష్ కుమార్, అరకు అసెంబ్లీ యువజన విభాగం అధ్యక్షుడు రేగం శివరామకృష్ణ, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణం.హుకుంపేట సర్పంచ్ పూర్ణిమ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం


