వైద్య బృందాలకు ఎన్‌క్యూఏఎస్ అవార్డులు
సాక్షి,పాడేరు: నాణ్యమైన వైద్యసేవలు అందించిన పీహెచ్‌సీల వైద్యబృందాలకు నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్యూఏఎస్)అవార్డులతో ఘనంగా సత్కరించారు. కలెక్టరేట్‌లో బుధవారం అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, కలెక్టర్ దినేష్‌కుమార్, ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, వైద్యులు, వైద్యసిబ్బందికి ఈఅవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు పొందిన వారిలో డుంబ్రిగుడ, అనంతగిరి, భీమవరం, కిల్లోగుడ పీహెచ్‌సీల వైద్యులు పి.రాంబాబు, జ్ఞానేశ్వరి, అనూఫ్,నజిబుల్లా,ఆరోగ్య,వెల్‌నెస్ కేంద్రాలకు సంబంధించి లగిశపల్లి,పెదలువ్వాసింగి,కితలంగి హెచ్‌డబ్ల్యూసీలు జి.రాజులమ్మ,సాయికుమార్,ప్రియాంక ఉన్నారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్, క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్డ్స్ జిల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఎం.ఎస్.లలిత పాల్గొన్నారు.


