గంజాయి కేసుల్లో పాత నిందితుడు అరెస్ట్
నర్సీపట్నం: పదే పదే గంజాయి నేరాలకు పాల్పడుతున్న పాత నిందితుడిని నర్సీపట్నం రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు..నర్సీపట్నం మండలం, గబ్బాడ గ్రామానికి చెందిన గంజాయి కేసుల్లో పాత నేరస్థుడైన మాకిరెడ్డి రాజశేఖర్(31)పై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేసి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. పాత నేరస్థుడిని ఏడాది పాటు నిర్బంధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్‌ఐ రాజారావు డీఎస్పీ పర్యవేక్షణలో నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై నర్సీపట్నం రూరల్ పోలీసుస్టేషన్, కశింకోట, పెందుర్తి ఎకై ్సజ్ పోలీసుస్టేషన్‌లో గంజాయి కేసులు ఉన్నాయి. గంజాయి వ్యాపారం చేసినా, రవాణాకు సహకరించినా, పండించినా, నిల్వ చేసినా, గంజాయి వ్యాపారులకు మధ్యవర్తిత్వం చేసినా ఉపేక్షించేదిలేదని డీఎస్పీ హెచ్చరించారు. పునరావృత నేరాలకు పాల్పడేవారిపై పిట్ ఎన్‌డీపీఎస్, పీడీ యాక్ట్ ప్రయోగించి అక్రమ ఆస్తులను సైతం జప్తు చేస్తామని, చట్ట ప్రకారం జైలుకు పంపుతామని డీఎస్పీ హెచ్చరించారు.


