బెల్టుషాపుపై దాడి
161 మద్యం బాటిళ్లు స్వాధీనం
నక్కపల్లి: మండలంలో చినదొడ్డిగల్లులో నిర్వహిస్తున్న బెల్టుషాపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. మహిళా ఎస్‌ఐ సాహేబా అంజుమ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీఐ మురళి ఆదేశాల మేరకు తమకు వచ్చిన సమాచారం ప్రకారం ఎస్‌ఐ మల్లేశ్వరరావు సిబ్బందితో చినదొడ్డిగల్లులో నిర్వహిస్తున్న బెల్టుషాపుపై దాడులు చేశామన్నారు. పాన్‌షాపులో అక్రమంగా నిల్వచేసిన 161 మద్యం బాటిళ్లు(96 వైన్‌బాటిళ్లు, 65 బీరు సీసాలను) స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.42,880ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ చట్టం సెక్షన్ 34 (ఏ)కింద కేసు నమోదు చేసి పాన్‌షాపు నిర్వాహకుడు కె.రామకృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు.


