భార్యతో గొడవ పడిన భర్త అదృశ్యం
యలమంచిలి రూరల్: భార్యతో గొడవ పడిన భర్త మూడు వారాలుగా అదృశ్యమైన ఘటన మండలంలోని లక్కవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కడిమి శంకర్రావు(46) బార్బర్‌గా పనిచేస్తూ తన భార్య గని లక్ష్మి, ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్నాడు. భార్యాభర్తలిద్దరికీ తరచూ గొడవలు జరుతున్నాయి. గత నెల 30వ తేదీ ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిన శంకర్రావు తిరిగి ఇప్పటివరకు ఇంటికి రాలేదు. ఎంత వెతికినా భర్త ఆచూకీ లభించకపోవడంతో ఆమె యలమంచిలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు.


