దువ్వాడ మీదుగా మరో అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్
తాటిచెట్లపాలెం: దువ్వాడ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు. ఎస్‌ఎంవీటి బెంగళూరు–రాధికాపూర్ (16223) వీక్లీ అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రతీ గురువారం మధ్యాహ్నం 1.50 గంటలకు ఎస్‌ఎంవీటి బెంగళూరులో బయల్దేరి మరుసటిరోజు శుక్రవారం ఉదయం 10.20 గంటలకు దువ్వాడకు, శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు రాధికాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాధికాపూర్–ఎస్‌ఎంవీటి బెంగళూరు(16224) వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు రాధికాపూర్‌లో బయల్దేరి మరుసటిరోజు మధ్య రా త్రి (మంగళవారం తెల్లవారు) 12.08 గంటలకు దువ్వాడకు, మంగళవారం రాత్రి 8.45 గంటలకు ఎస్‌ఎంవీటి బెంగళూరు చేరుకుంటుంది. ఈ అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ 11–జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్, 8–స్లీపర్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజి వ్యాన్, 1–పాంట్రీ కార్ కోచ్ మొత్తం 22 కోచ్‌లతో నడుస్తుంది.


