ఏపీ జేఏసీ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి
మహారాణిపేట: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ జేఏసీ(అమరావతి) 4వ రాష్ట్ర మహా సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్టు ఏపీ జేఏసీ(అమరావతి) జిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వరరెడ్డి చెప్పారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న రెవెన్యూ భవనంలో పోస్టర్‌ను ఈ మేరకు విడుదల చేశారు. ఈ మహాసభకు విశాఖ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగులు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ అసోసియేట్ చైర్మన్, రెవెన్యూ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎ.త్రినాథరావు, రెవెన్యూ సంఘ జిల్లా కార్యదర్శి శ్యాం ప్రసాద్, జేఏసీ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.రావు, కోశాధికారి బి.రవిశంకర్, జేఏసీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు శైలజా పాణిగ్రహి, కార్యదర్శి కిరణ్ కుమారి, విశాఖ డివిజన్ జేఏసీ చైర్మన్ ఎ.కిశోర్ కుమార్, కార్యదర్శి శంకరరావు, భీమిలి జేఏసీ చైర్మన్ బిఎస్‌ఎస్ ప్రసాద్, కార్యదర్శి కె.అప్పల రాజు, క్లాస్ ఫోర్ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈగల శ్రీనివాసరావు, కో ఆపరేటివ్ డిపార్టుమెంట్ ఉద్యోగులు,వీఆర్‌వో ఉద్యోగులు ప్రభుత్వ డ్రైవర్లు పాల్గొన్నారు.


