క్రేన్ సాయంతో బస్సు తొలగింపు
● లోయలోంచి బయటకు తీసిన పోలీసులు
చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్‌రోడ్‌లో శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన బస్సును పోలీసులు శనివారం క్రేన్‌సాయంతో బయటకు తీయించారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన ఉంచారు. ఇలావుండగా ఈ ప్రమాదంలో మృతిచెందిన తెనాలికి చెందిన శైలారాణి(64) మృతదేహాన్ని శనివారం బంధువులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందగా శుక్రవారం ఎనిమిది మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి స్వస్థలాలకు పంపడం తెలిసిందే. శైలారాణి మృతదేహానికి శనివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని ఆమె మేనల్లుడు తిరుపతికి చెందిన వినయ్‌కుమార్‌కు అప్పగించారు. కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని ఆమె మేనల్లుడు చింతూరులోనే ఖననం చేయించారు. తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్‌దొర ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


