మెగా లోక్ అదాలత్‌లో51 కేసులు పరిష్కారం
● రూ.2,28,669లు జరిమానా విధింపు
అరకులోయ టౌన్: స్థానిక ప్రథమ శ్రేణి జ్యుడీ
షియల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో 51 కేసులను ఇన్‌చార్జీ జడ్జి రాము పరిష్కరించారు. వీటిలో ఎకై ్సజ్‌కు సంబంధించి 19 కేసుల్లో రూ.97,499 జరిమానా విధించారు. భార్యాభర్తల తగదా కేసులో భార్యకు మెయింటినెన్స్ కింద రూ.లక్ష, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు సంబంధించి 6 కేసుల్లో రూ.17,450, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారికి సంబంధించి 13 కేసుల్లో రూ.6,500 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో అరకు సీఐ ఎల్.హిమగిరి, అరకు, డుంబ్రిగుడ ఎస్‌ఐలు గోపాలరావు, పాపారావు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.


