సంరంభానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సంరంభానికి సిద్ధం

Dec 15 2025 8:52 AM | Updated on Dec 15 2025 8:52 AM

సంరంభ

సంరంభానికి సిద్ధం

యుద్ధ నౌకల

యుద్ధ నౌకల విన్యాసాలు

సాక్షి, విశాఖపట్నం : మహాసముద్రాల మధ్య స్నేహపూర్వక బంధాల్ని బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ సమన్వయం, సహకారంతో నావికాదళ పరాక్రమాన్ని చాటిచెప్పేందుకు విశాఖపట్నం నగరం సిద్ధమవుతోంది. తూర్పు నౌకాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతిపెద్ద యుద్ధ నౌకల సంరంభానికి ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు పది రోజుల పాటు ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)తో పాటు మినీ ఐఎఫ్‌ఆర్‌గా పిలిచే మిలాన్‌–2026, ఇండియన్‌ ఓషన్‌ నావల్‌ సింపోజియం (ఐఓఎన్‌ఎస్‌)లను ఏకకాలంలో ఇక్కడ నిర్వహించనున్నారు.

ఈ మహోత్సవం కోసం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఆరు నెలల క్రితం నుంచి ఐదుసార్లకు పైగా సమీక్షలు నిర్వహించగా.. తాజాగా శనివారం తుది ప్రణాళిక సమావేశం జరిగింది. ఈఎన్‌సీ హెడ్‌క్వార్టర్స్‌ ఆపరేషన్స్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ మనోజ్‌ ఝా ఆధ్వర్యంలో జరిగిన ఈ తుది సమావేశానికి 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్‌గా హాజరయ్యారు. స్నేహభావం, సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

145 దేశాలకు ఆహ్వానం..

2001లో భారత్‌లో తొలిసారి ముంబైలో ఐఎఫ్‌ఆర్‌ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్‌ఆర్‌లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌–2026 కోసం ఇప్పటివరకూ 137 దేశాలకు ఆహ్వానం పంపించింది. ఇప్పటి వరకూ 61 దేశాలు నమోదు చేసుకున్నాయి. 61 దేశాలకు సంబంధించి 23 యుద్ధ నౌకలు రాబోతున్నా యి. మిగిలిన దేశాలు త్వరలోనే సమ్మతిని వెల్లడించే అవకాశం ఉంది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్‌ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్‌ ఏవియేషన్‌ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్‌, రాజ్‌పుత్‌ క్లాస్‌, కమోర్తా క్లాస్‌, విశాఖ క్లాస్‌, శివాలిక్‌ క్లాస్‌, బ్రహ్మపుత్ర క్లాస్‌, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్‌ టాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్‌, గ్రీన్‌టగ్స్‌ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్‌ గార్డ్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్‌ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి.

అత్యాధునిక సర్ఫేస్‌ యుద్ధనౌకలు,

జలాంతర్గాములు

ఈ విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన అత్యాధునిక సర్ఫేస్‌ యుద్ధనౌకలు, జలాంతర్గాములు, నావల్‌ ఏవియేషన్‌ విమానాలు పాల్గొననున్నాయి. ఇందులో ఢిల్లీ క్లాస్‌, రాజ్‌పుత్‌ క్లాస్‌, కమోర్తా క్లాస్‌, విశాఖ క్లాస్‌, శివాలిక్‌ క్లాస్‌, బ్రహ్మపుత్ర క్లాస్‌, నీలగిరి వంటి వివిధ తరగతులకు చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో పాటు సహాయకారి నౌకలైన ఫ్లీట్‌ ట్యాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్‌ వంటివి తమ సత్తా చాటనున్నాయి. వీటితో పాటు కోస్ట్‌ గార్డ్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) వంటి సముద్ర సంస్థలకు చెందిన నౌకలు కూడా ఈ సమీక్షలో భాగస్వామ్యం కానున్నాయి. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సహకారంతో 2022లో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూతో పాటు మిలాన్‌ను, 2024 ఫిబ్రవరిలో మరోసారి మిలాన్‌ విన్యాసాలను విశాఖ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు ఐఎఫ్‌ఆర్‌కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనల కేంద్రంగా విశాఖ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది.

ఎప్పుడు... ఎలా.. ఎవరెవరు.?

ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌–2026, ఐఓఎన్‌ఎస్‌ కాంక్లేవ్‌ ఆఫ్‌ చీఫ్స్‌(సీవోసీ) కార్యక్రమాలు ఫిబ్రవరి 15 నుంచి 25 వరకూ విశాఖ వేదికగా వరుసగా నిర్వహిస్తున్నారు.

ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌) ప్రారంభం కానుంది. డాక్టేరియన్‌, జాయింట్‌ ఆపరేషన్లపై ఐఎఫ్‌ఆర్‌లో మిత్రదేశాలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

15 నుంచి వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు, నౌకాదళ ప్రతినిధులు విశాఖకు రానున్నారు.

18న ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఫ్లీట్‌ని భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సమీక్షించనున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలు, సదస్సు కార్యక్రమాల్లో 19వ తేదీ కీలకమైనది.

ఫిబ్రవరి 19న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పరేడ్‌ని బీచ్‌రోడ్డులో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు.

అదేవిధంగా మిలాన్‌–2026 కూడా 19న ప్రారంభం కానుంది.

దీంతో పాటు రక్షణ దళం, నౌకాదళంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే అంశాలపై చర్చించేందుకు ఇండియన్‌ ఓషన్‌ నేషనల్‌కాంక్లేవ్‌(ఐఓఎన్‌ఎస్‌) సదస్సుని మహాసాగర్‌ పేరుతో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కానుంది.

ఈ సదస్సుకు 25 సభ్యదేశాల చీఫ్‌లతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన అతిథులు రాబోతున్నారు.

ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌లో 19 నుంచి 20 వరకూ హార్బర్‌ ఫేజ్‌ విన్యాసాలు జరుగుతాయి.

21 నుంచి 25 వరకూ సీ ఫేజ్‌ విన్యాసాలు నిర్వహిస్తారు.

ముగిసిన నౌకాదళ సన్నాహక సమావేశాలు

విశాఖలో ఐ.ఎఫ్‌.ఆర్‌, మిలాన్‌, ఐఓఎన్‌ఎస్‌ నిర్వహణ

ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖ తీరంలో యుద్ధ వాతావరణం

ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ఆధ్వర్యంలో ముగిసిన మూడు దఫాల సమీక్షలు

సమీక్షలకు హాజరైన 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు

సంరంభానికి సిద్ధం1
1/1

సంరంభానికి సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement