పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం
సాక్షి, పాడేరు: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దర్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరజీవి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అమరావతి ప్రాంతంలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం,స్మృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం గర్వంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో అంబేడ్కర్,ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు,కలెక్టరేట్ ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


