జాతీయస్థాయి విలువిద్య పోటీల్లో ప్రతిభ
● బంగారు పతకాలు సాధన
పాడేరు : హైదరాబాద్ కేంద్రంగా ఈనెల 10నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి 32వ సీనియర్ జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. సీనియర్స్ విభాగంలో సొలగం సాంబశివతో పాటు పాడేరు మోదమాంబ హైస్కూల్ విద్యార్థి సీహెచ్ మోహిత్‌సాయి, సోడే దేశయ్య టీమ్ విభాగంలో ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. పోటీల్లో పాల్గొనేందుకు వీరికి కలెక్టర్ దినేష్‌కుమార్ ఆర్ధిక సహాయం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించడంపై జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి జగన్‌మోహన్‌రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టాబ్బాయ్, ఆర్చరీ అకాడమి ఫౌండర్, కోచ్ అడపా సుధాకర్ నాయుడు అభినంధనలు తెలిపారు.


