రక్తపు ధారలు | - | Sakshi
Sakshi News home page

రక్తపు ధారలు

Dec 14 2025 12:00 PM | Updated on Dec 14 2025 12:00 PM

రక్తప

రక్తపు ధారలు

● దారుణంగా మారేడుమిల్లి– చింతూరు ఘాట్‌రోడ్డు ● అజాగ్రత్తగా నడిపితే అగాధంలోకి.. ● రక్షణ చర్యలు పట్టని ఆర్‌అండ్‌బీ అధికారులు ● ప్రభుత్వం నుంచి స్పందన కరువు ● నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న భారీ వాహనాలు

● దారుణంగా మారేడుమిల్లి– చింతూరు ఘాట్‌రోడ్డు ● అజాగ్రత్తగా నడిపితే అగాధంలోకి.. ● రక్షణ చర్యలు పట్టని ఆర్‌అండ్‌బీ అధికారులు ● ప్రభుత్వం నుంచి స్పందన కరువు ● నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న భారీ వాహనాలు
జిల్లాలో అధ్వానంగా మారిన ఘాట్‌రోడ్లు ప్రయాణికుల పాలిట యమపాశంగా మారాయి. ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్వహణ లోపమే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మార్గాల్లో సరియైన రక్షణ చర్యలు లేనందున వాహనం అదుపుతప్పితే లోయలోకి పడిపోయే పరిస్థితి నెలకొంది. అయినా ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మారేడుమిల్లి–చింతూరు ఘాట్‌రోడ్డులో లోయలోకి బస్సు బోల్తా ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఘాట్‌ మార్గాల్లో ప్రయాణానికి భద్రత ఏమేర అనే ప్రశ్న తలెత్తుతోంది.

మారేడుమిల్లి– చింతూరు ఘాట్‌లో రోడ్డు అధ్వానంగా మారిన ప్రాంతాలు

మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో మొరాయించిన భారీ వాహనం

అడవి బాటలో..

రంపచోడవరం/చింతూరు/మోతుగూడెం: మారేడుమిల్లి– చింతూరు ఘాట్‌ మార్గంలో భారీ వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదు. అయినా ప్రయాణించడంతో కొన్ని సార్లు ఘాట్‌ రోడ్డు మధ్యలో మొరాయిస్తున్నాయి. దీంతో గంటలు తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు, వాహనదారులు, పిల్లలు తెల్లవార్లు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి.

● మారేడుమిల్లి–చింతూరు ఘాట్‌ రోడ్డు పాములేరు నుంచి ప్రారంభమై సోకులేరు వ్యూపాయింట్‌ వద్ద ముగుస్తుంది. ఘాట్‌ రోడ్డు 28 కిలోమీటర్లు మేర ఉంటుంది. ఈ మధ్యలో సుమారు 10 వరకు అత్యంత ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఆంధ్రా, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు కలిపే మార్గం కావడంతో ఈ రోడ్డుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇటువంటి ఘాట్‌ రోడ్డులో ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్వహణ పనులు, రక్షణ చర్యలు పటిష్టంగా చేపట్టిన సందర్భాలు లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఘాట్‌ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదంలో బస్సును మలుపు తిప్పే క్రమంలో వెనుక భాగం జారి కిందికి పడిపోయింది. ఈ ఘటనతో బస్సు వెనుక భాగంలో కూర్చున్న తొమ్మిది మంది మృతి చెందారు. సుమారు 22 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మార్గంలో ప్రమాదకర మలుపులు, లోయలు ఉన్న చోట రక్షణ చర్యలు (ఐరన్‌ గడ్డర్లతో కంచె ) ఏర్పాటు చేసి ఉంటే ప్రమాద తీవ్రత చాలా వరకు తగ్గేదని పలువురు పేర్కొంటున్నారు.

దుర్ఘటనలిలా.

● అరకు నుంచి గురువారం రాత్రి భద్రాచలం బయలుదేరిన యాత్రికుల బస్సు శుక్రవారం తెల్లవారుజామున లోయలోకి బోల్తా పడి ప్రమాదానికి గురైంది.

● 2019 అక్టోబరు 15న కర్ణాటకకు చెందిన యాత్రికులు భద్రాచలంలో బయలు దేరి అన్నవరం వెళ్తుండగా సీతారాములు బొమ్మ వద్ద పైరోడ్డు నుంచి దిగువ రోడ్డులో వాహనం పడిపోయింది. ఈ ఘటనలో వాహనం వెనుక భాగంలో కూర్చున ఏడుగురు మృతి చెందారు. అప్పటిలో కొన్నిచోట్ల మొక్కుబడిగా రక్షణ చర్యలు చేపట్టిన రోడ్లు భవనాల శాఖ ఆతరువాత గాలికొదిలేసింది.

ప్రయాణం సాహసమే.. : మారేడుమిల్లి–చింతూరు ఘాట్‌ రోడ్డులో ప్రయాణం వాహనదారులకు సాహసంగా మారింది. ఏ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు అధ్వానంగా ఉండడంతో పాటు నిత్యం భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి. పాములేరు నుంచి సోకులేరు వ్యూపాయింట్‌ వరకు 28 కిలోమీటర్లు ఉండగా ఇందులో పది కిలోమీటర్లు రోడ్డు మాత్రమే నిర్మించారు. మిగిలిన చోట్ల రోడ్లు గోతులమయంగా మారి అధ్వానంగా ఉంది.

అవగాహన కల్పించాలి

ఘాట్‌రోడ్‌లో డ్రైవింగ్‌పై వాహ నదారులకు అధికారులు అవగాహన కల్పించాలి. పల్లానికి సెకండ్‌ లేదా థర్డ్‌ గేరులో దిగాల్సి ఉండగా ఆయిల్‌ మిగు లుతుందనే కక్కుర్తితో న్యూట్రల్‌ గేరులో దిగుతున్నారు. – ఎం.శివరామకృష్ణ, మోతుగూడెం

భారీ వాహనాలు నిషేధించాలి

ఘాట్‌రోడ్‌లో భారీ వాహనాల రాకపోకల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. కంటైనర్లు, ఊక లారీలు తరచూ ఘాట్‌రోడ్‌లో నిలిచిపోయి గంటల తరబడి ట్రాఫిక్‌ జాం అవుతోంది.

– వేగి రాజా, మోతుగూడెం

రక్షణ గోడలు నిర్మించాలి

ఘాట్‌రోడ్‌లో తరచూ ప్రమా దాలు జరుగుతున్నందున తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. మలుపుల వద్ద వాహనా లు ప్రమాదాల బారిన పడుతున్నందున పటిష్టమైన రక్షణ గోడలు నిర్మించాలి. – సవలం అమల, ఎంపీపీ, చింతూరు

ప్రమాదకరంగా ఘాట్‌ రోడ్లపై ప్రయాణం.. అనుక్షణం భయంభయం

రక్తపు ధారలు 1
1/7

రక్తపు ధారలు

రక్తపు ధారలు 2
2/7

రక్తపు ధారలు

రక్తపు ధారలు 3
3/7

రక్తపు ధారలు

రక్తపు ధారలు 4
4/7

రక్తపు ధారలు

రక్తపు ధారలు 5
5/7

రక్తపు ధారలు

రక్తపు ధారలు 6
6/7

రక్తపు ధారలు

రక్తపు ధారలు 7
7/7

రక్తపు ధారలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement