నేటి నుంచి యథావిధిగా అంతర్‌రాష్ట్ర బస్ సర్వీసులు
సీలేరు: మావోయిస్టుల పీఎల్‌జీవో వారోత్సవాల సందర్భంగా నిలిపివేసిన అంతర్‌రాష్ట్ర బస్ సర్వీసులను మంగళవారం నుంచి యథావిధిగా నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు వారం రోజులుగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారంతో మావోయిస్టుల వారోత్సవాలు ముగియడంతో ఆ బస్సు సర్వీసులను యథావిధిగా నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించారు.


