ఖర్చు చెప్పడం లేదు
పర్యాటకం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని నిబంధనల ప్రకారం పంచాయతీలోని గ్రామాల అభివృద్ధికి కేటాయించాలి. రోడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. వచ్చిన ఆదాయానికి జవాబుదారీతనం లేదు. అటవీ అధికారులు ఇష్టరాజ్యంగా వాటిని ఖర్చు చేస్తున్నారు. గుడిసెకు వెళ్లే పర్యాటకుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వచ్చిన ఆదాయంపై అడిట్ జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏ వేదికపైనగాని, సమావేశాల్లోగాని, ప్రజాప్రతినిధులకు గాని వచ్చిన ఆదాయం, ఖర్చు చెప్పకపోవడంపై అనుమానాలు ఉన్నాయి.
– గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ, మారేడుమిల్లి
ఆరోపణలు అవాస్తవం
గుడిసె పర్యాటకంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. గుడిసె,గుంపెన గండి గ్రామాలకు ఇప్పటికే టెంట్ సామాన్ల కిట్లు పంపిణీ చేశాం. ఆయా గ్రామాలకు చెందిన పది మంది గిరిజన యువకులకు కమ్యూనిటి బేస్డ్ ఎకో టూరిజంలో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. నూతనంగా పాములేరు సమీపన పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఏటా అడిట్‌లు సక్రమంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా అధికారులు వద్ద తీసుకోవాలి.
–అజాద్, అటవీ శాఖ రేంజ్ అధికారి, మారేడుమిల్లి


